ఆర్థికమాంద్య భయాలతో సుమారు 8వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నఅమెజాన్ ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనే అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఆ ప్రకటనతో స్టాక్ మార్కెట్లో అమెజాన్ షేర్ వ్యాల్యూ కోల్పోయింది. దీంతో బెజోస్ ఒక్క రోజే 670 మిలియన్ డాలర్లు నష్టపోయారు. ప్రస్తుతం ఆయన 108 బిలియన్ డాలర్ల ఆస్తి విలువతో ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో 6వ స్థానంలో ఉన్నారు.