దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ నేలచూపులు చూశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 452.90 పాయింట్లు నష్టపోయి 59,900.37 వద్ద, నిఫ్టీ 127.95 పాయింట్ల నష్టంతో 17,864.20 దగ్గర స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 82.75గా నిలిచింది. HCL, TCS, విప్రో, భారతీ ఎయిర్టెల్, టాటాస్టీల్, ICICI బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి.