కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రేపల్లె ఇన్చార్జి సిఐ దేవర శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం రేపల్లె సెబ్ స్టేషన్ పరిధిలోని గుడికాయలంక గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులను సత్ప్రవర్తన నిమిత్తం రేపల్లె తహసిల్దార్ ముందు బైండోవర్ చేశారు. వీరు గతంలో కోడిపందాలు నిర్వహించిన నేపథ్యంలో మరోసారి పందాలకు వెళ్లకుండా ముందు జాగ్రత్తగా బైండోవర్ చేసామని తెలిపారు.