గాజువాక చెత్త పొడి చెత్త అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జోనల్ కమిషనర్ పి. సింహాచలం ఇచ్చేశారు. ఆయన మాట్లాడుతూ మన ఇంటిలో ఉండే తడి, పొడి చెత్తలను వేరు చేసి నిత్యం మన ఇంటి దగ్గిరకి వచ్చే జీవీఎంసీ సిబ్బందికి ఇచ్చి స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగస్వాములు కావాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలో మన విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని కోరేరు. వార్డు ఇంచార్జ్ దొడ్డి రమణ మాట్లాడుతూ మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్ని శుభ్రంగా ఉండడం తోనే మన మందరం సంపూర్ణ ఆరోగ్యంగా జీవించగలమన్నారు. మన పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు ప్రతి రోజూ మన ఇంటి వద్దకు వచ్చి తడి పొడి చెత్తలను సేకరిస్తున్న జివిఎంసి శానిటరీ సిబ్బందికి ప్రజలందరూ సహకరించి తడి పొడి చెత్తలను ఇంటి ప్రాంతాల్లో ఉన్న కాలవలలో కానీ, రోడ్లపై కానీ వేయకుండా ఇంటికి వచ్చే జివిఎంసి సిబ్బందికి చెత్తలను వేరు చేసి ఇవ్వాలని సూచించారు. ప్రజలందరూ సహకారంతోనే స్వచ్ఛ సర్వేక్షణలో మన విశాఖ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపగలమన్నారు. అనంతరం యూజర్ చార్జీలు కట్టి జీవీఎంసీ అభివృద్ధికి సహకరిస్తారని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జి. శ్రీనివాసరావు, ఏ ఎం హెచ్ ఓ డా కిరణ్ కుమార్, శానటరీ ఇన్స్పెక్టర్ తాత రావు, సి ఓ సూర్యనారాయణ, హౌసింగ్ బోర్డ్ కాలనీ గృహ యాజమాన్యాల సంఘం ప్రెసిడెంట్ దాస్, సెక్రెటరీ ఎం. శ్రీకాంత్, డి. సురేష్, కోశాధికారి దుర్గారావు, మెంబర్లు భాస్కరరావు, పి. దేవి, డి. లత, జి. భోలక్ష్మి, సచివాలయ కన్వీనర్లు అర్. రేవతి, కె. బాలాజీ, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటరీలు, ఆర్ పి లు, గ్రామ ప్రజలు, యువత, ఇతర జివిఎంసి సిబ్బంది, వార్డు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.