పౌష్య పౌర్ణమి ధనుర్మాసంలో అరుద్ర నక్షత్రం శుక్రవారం వచ్చిన విశేషమైనది. దీంతో శుక్రవారం ఇసుకకొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానానికి భక్తుల తాకిడి ఎక్కువుగా కనిపించింది. వేలాది భక్తులు సాంప్రదాయంగా ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం విశేష వ్రతాలూ చేసుకొన్న భక్తులు, వస్త్రం, ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బుద్ద మహాలక్ష్మి నగేష్, ప్రధాన అర్చకులు ఫణిహారం నరసింహాచార్యులు, సిబ్బంది తగు ఏర్పాట్లు చేశారు.