జమ్మూకశ్మీర్ లో డెమోక్రటిక్ ఆజాద్ పార్టీకి షాక్ తగిలింది. కొద్దిరోజుల క్రితం గులాంనబీ ఆజాద్ తో కలిసి వెళ్లిన 17 మంది సీనియర్ నేతలు తిరిగి కాంగ్రెస్ లోకి చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో వీరంతా శుక్రవారం సొంతగూటికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కశ్మీర్ లోకి ప్రవేశించడానికి 2 వారాల ముందు వీరంతా తిరిగి పార్టీలో చేరడంతో కాంగ్రెస్ కు ఉత్సాహాన్నిస్తోంది.