ఏపీలోని విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవుల షెడ్యూల్ లు మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదట జనవరి 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించగా, తాజాగా వీటిని 12 నుండి 17 వరకు మార్పు చేశారు. 17వ తేదీన ముక్కనుమ ఉన్నందున సెలవు ప్రకటించాలని మంత్రి బొత్సకు ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి చేసినందున ఈ మార్పులు చేసినట్లు సమాచారం. పాఠశాలలు తిరిగి 18న ప్రారంభమవుతాయి.