ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా గంటల్లోనే బాంబులతో విరుచుకుపడింది. క్రామాటోర్క్స్ నగరంపై వైమానిక దాడులకు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో 14కు పైగా ఇళ్లు ధ్వంసమైనట్లు స్థానిక మేయర్ హోంచరెంకో చెప్పారు. ఖైర్సన్ లో జరిగిన దాడిలో ఒకరు మృతి చెందారని వెల్లడించారు. కాల్పుల విరమణ సమయం 36 గంటలు కొనసాగనుండగా రష్యా దళాలు నిబంధనలు ఉల్లంఘించాయన్నారు.