ప్రయాణ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, అనుచితంగా ప్రవర్తించే ప్రయాణీకులపై చర్య తీసుకోవడంలో సంబంధిత విమానయాన సిబ్బంది విఫలమైతే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీసీఏ శుక్రవారం హెచ్చరించింది. దురుసుగా ప్రవర్తించే ప్రయాణీకులను నియంత్రించే సమయంలో అన్ని ప్రయత్నాలు విఫలమైతే హ్యాండ్ కఫ్స్ వంటివి వినియోగించవచ్చని పేర్కొంది. ఇటీవల ఘటనల నేపథ్యంలో ఇలా స్పందించింది.