కొండచరియలు విరిగిపడగా ఏర్పడిన శిథిలాల మీద నిర్మితం కావడం వల్లే జోషీమఠ్ క్రమంగా కుంగిపోతుందని వాడియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ డైరెక్టర్ కలాచంద్ సైన్ తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే సెస్మిక్ జోన్-5లో ఉండడం, ఇక్కడి నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వంటి కారణాలతో ఇక్కడి శిలలు కాలక్రమేణా బలహీనంగా మారిపోయాయన్నారు.