నర్సీపట్నం ఆర్డిఓ బిహెచ్ భవాని శంకర్ శుక్రవారం నర్సీపట్నంలో పలు పెట్రోల్ బంకులను తనిఖీ చేశారు. అగ్ని ప్రమాదాల నివారణకు పెట్రోల్ బంకులు యజమానులు తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించారు. వాహనాల్లో పోస్తున్న పెట్రోల్ కొలత కరెక్ట్ గా ఉన్నదా లేదా అనే విషయాన్ని మెజర్మెంట్ ద్వారా కొలిచి చూశారు. ఆర్డిఓ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. ఈ తనిఖీల్లో తహసిల్దార్ వివి రమణ, సిబ్బంది పాల్గొన్నారు.