టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వర రావును శనివారం ఉదయం నక్కపల్లి మండలం టిడిపి బీసీ నాయకులు బృందం కలిసింది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని టిడిపి కంచుకోటగా ఉన్న నక్కపల్లి మండలంలో మరలా పూర్వ వైభవం రావాలని ఆయన సూచించారు. ఇందులో మాజీ ఎంపీపీ దేవర సత్యనారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు కురందాసు నూకరాజు, మాజీ వైస్ ఎంపీపీ వైబోయిన రమణ, మాజీ సర్పంచ్ గింజాల లక్ష్మణరావు, ఎంపీటీసీ సభ్యుడు కూండ్ర కనకారావు, గింజాల శ్రీనివాసరావు, కోసూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.