ఎపి ఎన్జీవో సంఘం కురుపాం తాలూకా యూనిట్ క్యాలెండర్ ను శుక్రవారం కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎపి ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులకు విశేషమైన సేవలు అందించాలని సూచించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరిశర్ల. బాపూజీ నాయుడు, ఎన్జీవో సంఘం అద్యక్షుడు ఎస్. ప్రకాష్, కార్యదర్శి రామకృష్ణ , ట్రెజరర్ సంతోష్ కుమార్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.