రష్యాతో యుద్ధంలో తలపడుతోన్న ఉక్రెయిన్ కు అగ్రరాజ్యం అమెరికా భారీ సహాయం ప్రకటించింది. 3.75 బిలియన్ డాలర్ల మిలిటరీ సహాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా మానవతా సహాయాన్ని అందిస్తోంది. ఇప్పటివరకూ 24.9 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది.