అమెరికా పార్లమెంట్ లో స్పీకర్ ఎన్నికపై అనిశ్చితి కొనసాగుతోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్ కార్తీని స్పీకర్ గా ఎన్నుకోవడానికి ఆ పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ స్పీకర్ పదవికి ఆయన పేరును నామినేట్ చేశారు. దీనికి కేవలం ఒకే ఒక్క ఓటు వచ్చింది. మొత్తం 430 మంది సభ్యులున్న ప్రతినిధుల సభలో ఒకే ఓటు వచ్చినట్లు ప్రకటించగా సభ్యులంతా పగలబడి నవ్వారు.