కేరళలో స్థానిక హోటల్ నుంచి ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న బిర్యానీ వంటకం ‘కుజిమంతి’ని తిని ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. కాసరగోడ్ సమీపంలోని పెరుంబాలకి చెందిన అంజు శ్రీపార్వతి డిసెంబర్ 31న రొమేనియా రెస్టారెంట్ లోంచి బిర్యానీ తెప్పించుకు తిని అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రిలో చేర్చగా ఈ తెల్లవారుజామున మరణించింది. పోలీసులు ఈ ఘటనపై విచారిస్తున్నారు.