విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని విజయనగరం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏ ఈ ఎస్ శైలజారాణి పిలుపునిచ్చారు. శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండల కేంద్రంలో గల డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు శుక్రవారం ఆమె మాదకద్రవ్యాలు వినియోగం, అనర్ధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాదకద్రవ్యాలు వినియోగం కారణంగా శారీరిక, మానసిక రుగ్మతలు ఏర్పడతాయని తద్వారా భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మాధక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులతో కొత్తవలస మండల కేంద్రంలో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి తదితర సిబ్బంది పాల్గొన్నారు.