లారీని కారు ఢీ కొనడంతో యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం రాత్రి దేవరపల్లి శివారు అవంతి ఫ్యాక్టరీ వద్ద జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం గోపాలపురం వైపు నుంచి దేవరపల్లి వైపు వస్తున్న లారీని, దేవరపల్లి వైపు నుంచి గోపాలపురం వెళుతున్న కారు ఢీకొనడంతో కారు నడుపుతున్న ఆలపాటి సందీప్ ఫణిచౌదరి (23) తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని గోపాలపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన ఫణిచౌదరి తన అక్క బావలను చూడడానికి గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం ద్విచక్రవాహనంపై వచ్చాడు. వేళ్ల చింతలగూడెంలోని తాన బావ కారును తీసుకుని దేవరపల్లి పనిమీద వచ్చి తిరిగి వెళుతుండగా జాతీయ రహదారి అవంతిపేట వద్ద ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శ్రీహరి తెలిపారు.