జగన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులు ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, అమ్మకాలు లేక ఆర్థికంగా నష్టపోతూ ఆందోళనకు గురవుతున్నారని పశ్చిమ గోదావరి టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. పింఛను లబ్ధిదారులకు సొమ్ము పెంచి అర్హులైన ఎందరో పింఛన్లు తొలగించారని, రాష్ట్రానికి ఇదేం ఖర్మ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాయకుదురులో శుక్రవారం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. అసమర్ధ ముఖ్యమంత్రిని గద్దె దింపాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కోశాధికారి మెంటే పార్ధసారధి, కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రైతులకు ఐకెపి ద్వారా ధాన్యం కొనుగోలు చేసిన 16 రోజుల్లో ధాన్యం సొమ్ము చెల్లించేవారని జగన్‌ప్రభుత్వం హాయాంలో ఆరునెలలు అయినా ఎటువంటి చెల్లింపులు జరగటం లేదని అన్నారు. కొల్లేపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీని వాసరావు, యరకరాజు గోపాలకృష్ణరాజు, కముజు హరిబాబు, పంపన సుధాకర్, వీరవల్లి గణేష్, తమ్మినీడి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.