నాలుగేళ్ల విరామంలో ఏలూరు జిల్లాలో 8 వేల ఓట్లు తగ్గాయి. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జిల్లా కేంద్రమైన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోనే 17 వేల ఓట్ల వరకు తగ్గడం. వలసలు, ఉద్యోగాల రూపేణా ఏలూరు జిల్లాలో నాలుగేళ్లుగా భారీగా ఓటర్లు తరలిపోకపోయినా ఎలా ఓటర్లు తగ్గారనే సందేహాలు వ్యక్తమవుతున్నా యి. నిజంగా తగ్గారా? లేదా రాజకీయ అవసరాల నిమిత్తం తగ్గించారా? అన్న అంశాలపై జిల్లాలో చర్చో పచర్చలు జరుగుతున్నా యి. నూజివీడు, కైకలూ రు, ఉంగుటూరు, దెం దులూరుల్లో ప్రజలు వేలల్లో పెరిగారు.