ఆర్బీఐ తాజాగా కీలక ప్రకటన చేసింది. నోటు మీద రాతలున్నాయి.. ఇవి చెల్లదమ్మా..", "గీతలున్న నోటు ఇచ్చావేంటీ.. నేనేం చేసుకోవాలి.. ఇది చెల్లదు వేరేది ఇవ్వు.." ఇలాంటి డైలాగులు మార్కెట్లు, దుకాణాలు, వాహనాల్లో ఈ మధ్య కాలంలో మీకు వినిపిస్తున్నాయా...? దానికి కారణం.. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. 2000, 500, 200, 100, 50, 20 రూపాయల నోట్లపై ఎవైనా రాతలు, గీతలుంటే అవి చెల్లుబాటు కావని.. అలాంటి నోట్లు చట్టబద్ధత ఉండదు అంటూ వాట్సప్ గ్రూపుల్లో వార్తలు షేర్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తలను చూసి రాతలున్న నోట్లు ఉన్న ప్రజలు భయపడుతున్నారు. తమ డబ్బులు ఎక్కడ చెల్లకుండా పోతాయేమోనని తెగ టెన్షన్ పడుతున్నారు.
అయితే.. నిజంగానే నోట్లపై రాతలు, గీతలుంటే చెల్లు కావా..? అంటే.. అలాంటిదేమీ లేదు అంటోంది ఆర్బీఐ. ఆ వార్తలన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేస్తోంది. ఒకవేళ మీ దగ్గర రాతలున్న నోట్లుంటే.. నిర్మొహమాటంగా ఖర్చు పెట్టుకోవచ్చని చెప్తోంది. బ్యాంకుల్లో, వ్యాపారాల్లో ఎక్కడైనా చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై పీఐబీ ఫాక్ట్ చెక్ రిపోర్టు విడుదల చేసింది. క్లీన్ నోట్ పాలసీ పెట్టిన విషయం నిజమే అయినప్పటికీ.. ఇప్పటికే గీతలు పడిన నోట్లు చెల్లవంటూ ఆర్బీఐ ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది. గీతలు, రాతలున్న నోట్లు కచ్చితంగా చెల్లుబాటు అవుతాయని.. వాటికి చట్టబద్దత కూడా ఉంటుందని వెల్లడించింది. అయితే.. క్లీన్ నోటీ పాలసీ ప్రకారం మాత్రం.. ప్రజలు నోట్లపై ఎలాంటి రాతలు, గీతలు గీయకూడదని విజ్ఞప్తి చేస్తోంది. అలాంటి వాటి వల్ల నోట్లు తొందరగా పాడైపోయి.. జీవిత కాలాన్ని తగ్గిస్తాయన్న ఉద్దేశంతోనే ఇలాంటి పాలసీ తీసుకొచ్చినట్టు పేర్కొంది పీఐబీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa