బ్రెజిల్ లో ప్రభుత్వ భవనాలపై తన మద్దతుదారుల దాడిని దేశ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ఖండించారు. అధికారంలోకి వచ్చేందుకు బోల్సోనారో ఇలా కుట్ర చేస్తున్నాడు అన్న అధ్యక్షుడి ఆరోపణలను తోసిపుచ్చారు. ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. దేశప్రజలు శాంతియుతంగా నిరసన చేపట్టాలని ఆయన సూచించారు. మరోవైపు ఈ ఘటనను భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా పలు దేశాల నేతలు ఖండించారు.