బ్రెజిల్ లో మాజీ అధ్యక్షుడి మద్దతుదారులు సుప్రీంకోర్టు, పార్లమెంటు భవనాలపై దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలు తనకు ఆందోళన కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు. నిరసనకారుల చర్యలను తప్పుబట్టిన ఆయన, ప్రజాస్వామ్య వ్యవస్థను అందరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెజిల్ ప్రభుత్వానికి భారత్ పూర్తి మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు.