వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మూడు వెల్లుల్లి రెబ్బలను చితక్కొట్టి ఓ గిన్నెలో నీళ్లు పోసి ఈ వెల్లుల్లి వేసి మరిగించాలి. 5 నిమిషాల తర్వాత వడగట్టి తాగాలి. ఇలా చేస్తే చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుందని చెబుతున్నారు. శరీరంలోని కొవ్వు కరిగి, బరువు తగ్గుతారు, అలాగే రక్త సరఫరా మెరుగుపడుతుంది. హైబీపీ కూడా తగ్గుతుందని పేర్కొంటున్నారు.