కుప్పం సహా పలు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులపై ఫిర్యాదుదారులుగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 307 సెక్షన్ దుర్వినియోగం చేసి టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని అన్నారు.సెక్షన్ 307 విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని స్పష్టమవుతోందని.. కుప్పం, పుంగనూరు, మాచర్ల తదితర ప్రాంతాల్లో అక్రమ అరెస్టులను తక్షణమే ఆపాలని చంద్రబాబు లేఖలో విజ్ఞప్తి చేశారు.