దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. సూచీలు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. ఉదయం సెన్సెక్స్ 239 పాయింట్ల నష్టంతో 59,875 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 73 పాయింట్లు నష్టపోయి 17,841 వద్ద కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ 81.74 వద్ద ట్రేడవుతోంది. టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.