ఆధార్ తనిఖీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీచేస్తూ UIDAI ఒక ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేసే సంస్థలు కచ్చితంగా భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించింది. వీలైనంత వరకు వినియోగదారులు మాస్క్‌డ్ ఆధార్‌ను వాడాలంది. ఆధార్‌ను 4 విధాలుగా (ఆధార్ ప్రింట్, ఈ-ఆధార్, ఎం-ఆధార్, ఆధార్ PVC) జారీ చేసిన వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ధ్రువీకరించుకోవాలని సూచించింది.