భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల కేంద్రంలో కొమురం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు బుధవారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. తొలిత కొమరం భీమ్ పూలమాలవేసి నివాళులర్పించారు, అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని బ్యాటింగ్ చేసి క్రీడాకారులలో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరిక దారుధ్యాన్ని పెంచుతాయన్నారు. క్రీడాకారులు ఆటలో నైపుణ్యాన్ని ఓడిసిపట్టి విజయాలు సాధిస్తూ, క్రీడలు వలన అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభను చాట వచ్చు అన్నారు.