గత పది రోజులుగా ఉత్తర భారతాన్ని తీవ్రమైన చలి, పొగమంచు వణికిస్తోంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. మరోవైపు పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, విమాన మార్గాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. సుమారు 40 విమానాలు, 26 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు వెల్లడించారు.