బీఎండబ్ల్యూ భారత మార్కెట్లోకి కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమరిజ్ మోడల్ ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.57.9 లక్షల నుండి ప్రారంభమవుతుంది. 2 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ తో పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ కారు 6.2 సెకన్లలో, డీజిల్ కారు 7.6 సెకన్లలో 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఈ కారు 15.39 kmpl మైలేజీ ఇస్తుంది. ఈ కారును దేశీయంగా తయారు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది.