ఏపీ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న తోడు పథకం కింద ఆరో విడత నిధులు విడుదలయ్యాయి. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు ప్రభుత్వం రూ.10 వేలు వడ్డీ లేని రుణాన్ని వారి ఖాతాల్లో జమ చేసింది. మెుత్తం 3.95 లక్షల మంది చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారికి రూ.395 కోట్ల రుణాలు అందించింది. గత 6 నెలలకు సంబంధించిన రూ.15.17 కోట్ల వడ్డీ రాయితీలను కూడా ప్రభుత్వం అందించింది.