కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 30న శ్రీనగర్లో ముగియనుంది. ఈ ముగింపు సమావేశానికి హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 24 పార్టీలకు లేఖ రాశారు. వైసీపీ, ఎంఐఎం, ఏఐయూడీఎఫ్, బీజేడీ, జేడీఎస్, బీఆర్ఎస్, ఆప్ వంటి మిత్రపక్షాలకు బీజేపీ లేఖ పంపలేదు. యాత్ర ముగింపు కార్యక్రమాన్ని జాతిపిత మహాత్మా గాంధీకి అంకితమిస్తున్నట్లు ఖర్గే తెలిపారు.