త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా ఓ బాలుడి కోసం తన వృత్తి ధర్మం నెరవేర్చారు. ముఖ్యమంత్రి కాకముందు పనిచేసిన హపానియాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ఈ ఉదయం నోటి సిస్టిక్ లెసియన్తో బాధపడుతున్న బాలుడికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. చాలా రోజుల తర్వాత సర్జరీ చేశానని.. ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలిపారు.