ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇమ్రాన్ ఖాన్ కు అరెస్ట్ వారెంట్ జారీ...ఎందుకంటే

international |  Suryaa Desk  | Published : Wed, Jan 11, 2023, 10:30 PM

గత కొద్ది కాలంగా పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ను కష్టాలు చుట్టుముడుతున్నాయి. పదవి నుంచి దిగిపోయిన తర్వాత నుంచి ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా, ఆయనకు అరెస్ట్‌ వారెంట్ జారీ అయింది. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-నవాజ్) పార్టీకి ప్రయోజనం కలిగించేలా ఎన్నికల కమిషన్(ఈసీపీ), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పక్షపాతంగా వ్యవహరించారంటూ ఇమ్రాన్, ఆ పార్టీ నేతలు పలుమార్లు బహిరంగంగానే ఆరోపించారు.


ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల కమిషన్ నిన్న అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎన్నికల కమిషన్‌పై చేసిన ఆరోపణలపై తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని ఇమ్రాన్‌కు గతేడాది ఆగస్టు, సెప్టెంబరులో నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన విచారణలో కమిషన్ ఎదుట హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఆ పార్టీ నేతలు చేసిన విజ్ఞప్తిని ఈసీపీ తిరస్కరిస్తూ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com