అరటిపండును రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ సీజన్లోనైనా మనకు లభించే పండ్లు ఇవి. రోజూ అల్పాహారంగా అరటిపండు తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఉండే మినరల్స్ మరియు ఎలక్ట్రోలైట్స్ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అరటి పండులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. గుండె సంబంధిత సమస్యలు కూడా ప్రభావితం కావు. పొటాషియం హైబీపీని అదుపులో ఉంచుతుంది.