కీర దోసకాయ జుట్టు ఆరోగ్యానికి మంచిది. కీర రసం కురుల ధృడత్వాన్ని పెంచుతాయి. దీనికోసం తొక్కతీసి సన్నగా తురిమి జ్యూస్ తియ్యాలి. జ్యూస్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి మర్ధన చేయాలి. గంట తరువాత సాధారణ షాంపుతో కడిగేయాలి. కీరా జ్యూస్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ కే జుట్టురాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. విటమిన్ ఏ సెబమ్ ఉత్పత్తిని పెంచి జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది. పొటాషియం, జింక్, మ్యాంగనీస్, పాంతోనిక్ యాసిడ్స్ కురులను దృఢంగా మారుస్తాయి.