చలికాలంలో నెయ్యి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. జలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ కల్పిస్తుందని చెప్పారు. జీర్ణక్రియ మెరుగుపడుతుందని కూడా చెబుతున్నారు. ప్రతిరోజూ ఆహారంలో నెయ్యి తీసుకుంటే మలబద్ధకం సమస్య కూడా తొలగిపోతుంది. శరీరంలోని అంతర్గత వేడిని నియంత్రించేందుకు నెయ్యి సహకరిస్తుందని చెబుతారు.