ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పెద్ద మనసు చూపారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న చిన్నారి హనీకి అన్ని విధాల అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్.జగన్‌ను డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన చిన్నారి హనీ, తల్లిదండ్రులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతూ చికిత్స కోసం గతంలో కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్న సీఎంను చిన్నారి హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబులు కలిశారు. అరుదైన గాకర్స్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారి హనీ చికిత్స కోసం ఇప్పటికే రూ.1 కోటి మంజూరు చేసిన సీఎం. చిన్నారి హనీ చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్లతో పాటు నెలకు రూ.10 వేలు పెన్షన్ కూడా అందిస్తున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ఆదేశాలతో చికిత్స అందుకుంటూ ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉన్న చిన్నారి హనీ ఈ రోజు పుట్టిన రోజు సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్‌ను హనీ తల్లిదండ్రులు నాగలక్ష్మి, రాంబాబు కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి హనీని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీర్వదించారు.