భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించడంలో తిరుమల తిరుపతి దేవస్థానం విఫలమైంది. 10 రోజుల్లో నిత్యం 80 వేల మంది చొప్పున 8 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనంపై టీటీడీ అధికారులు పెట్టిన పలు ఆంక్షలతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు రాలేక పొయారు. వైకుంఠ ద్వారాలు తెరిచిన 10 రోజుల్లో కేవలం 6 లక్షల 9వేల 189 మంది భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వారా దర్శనాన్ని అధికారులు కల్పించారు. దర్శనంపై టీటీడీ పెట్టిన ఆంక్షలతోనే స్వామి వారిని దర్శించుకోలేక పోయామని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa