ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెనిఫిట్‌ షో కోసం గందరగోళం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 02:55 PM

ఎన్టీఆర్ జిల్లా, నందిగామలో బాలకృష్ణ అభిమానులు ఆందోళనకు దిగారు. ఉదయం 6 గంటలకు బెనిఫిట్‌ షో వేస్తామని చెప్పిన నిర్వాహకులు ఇంకా బెనిఫిట్ షో వేయలేదు. తమ అభిమాన హీరో సినిమా కోసం ఉదయం 5 గంటల నుంచి థియేటర్ దగ్గర అభిమానుల పడిగాపులు కాస్తున్నారు. కాగా, పర్మిషన్ పేరుతో ఇంకా ‘వీరసింహా రెడ్డి’ బెనిఫిట్ షో మొదలుకాలేదు. దీంతో పెద్ద ఎత్తున్న అభిమానులు ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి స్పెషల్‎గా ఈ మూవీగా చాలా చోట్ల బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఈ సినిమాలోని సాంగ్స్, ట్రైలర్, బాలకృష్ణ డైలాగ్స్ అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నేడు (జనవరి 12)న భారీ స్థాయిలో రిలీజైంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ‘వీరసింహా రెడ్డి’ని నిర్మించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‎గా నటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa