ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుబాటులోకి వచ్చిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 02:54 PM

ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’ రైలు బుధవారం విశాఖపట్నంలో సందడి చేసింది. తొలుత దీన్ని సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య నడపాలని ప్రతిపాదించినా.. ఆ తర్వాత విశాఖట్నం వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతులు మీదుగా వర్చువల్‌గా ప్రారంభమయ్యే ఈ రైలును తొలుత ట్రయల్‌ రన్‌ కోసం చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి విశాఖపట్నం పంపించారు. విశాఖపట్నం-సికింద్రాబాద్‌ మధ్య ప్రయాణ దూరం 700 కి.మీ. కాగా, ఈ రైలు కేవలం 8.40 గంటల్లోనే గమ్యస్థానం చేరుస్తుందని విశాఖ రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ సురేశ్‌ తెలిపారు. ఈ రైలును గంటకు 160 కి.మీ. వేగంతో నడపొచ్చని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa