ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 21 నుంచి మధ్యాహ్న భోజనం కొత్త మెనూ అమలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 05:20 PM

మధ్యాహ్న భోజనం మెనూ మళ్లీ మారింది. ఈ నెల 21 నుంచి కొత్త మెనూ అమలుకు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్‌ నిధి మీనా ఉత్తర్వులు జారీచేశారు. తాజా ఉత్తర్వుల ప్రకారం... సోమవారం పొంగలి, వెజ్‌ పలావ్‌, గుడ్డు కూర, చిక్కీ... మంగళవారం చింతపండు పులిహోర, దొండకాయ పచ్చడి, గుడ్డు... బుధవారం వెజిటేబుల్‌ రైస్‌, ఆలూ కుర్మా, గుడ్డు, చిక్కీ... గురువారం సాంబార్‌ బాత్‌ లేదా లెమన్‌ రైస్‌, టమాటా పచ్చడి, గుడ్డు... శుక్రవారం అన్నం, ఆకు కూర పప్పు, గుడ్డు, చిక్కీ... శనివారం పాలకూర, కొత్తిమేర, పొదీన, కరివేపాకులో ఏదైనా ఒకదాంతో అన్నం, పప్పు చారు, స్వీట్‌ పొంగల్‌ పెట్టాలని ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com