‘‘దళితుల ప్రాణాలు తీస్తున్నవారికి నెల్లూరు ఎస్పీ విజయరావు కొమ్ముకాస్తున్నారు. మంత్రి కాకాణి కేసు ఫైళ్లు మిస్సింగ్ గురించి, లేడి కానిస్టేబుల్ కొలతలను మగ పోలీసులు తీసుకోవడంపై మాట్లాడానని నాపై ఆయన కక్ష కట్టారు’’ అని టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆరోపించారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వైసీపీ నేతలకు ఊడిగం చేస్తూ... దళితుల కోసం పోరాడుతున్న తనను అర్ధరాత్రి అరెస్టులతో, అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాగా, చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటే.. జగన్‌రెడ్డి పాలనలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో పేదల జీవితాల్లో ఈ సంక్రాంతి చీకటిమయం అయిందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ అన్నారు.