కోవిడ్ సమయంలో విధి నిర్వహణలో భాగంగా కరోనా వైరస్ బారినపడి మరణించన కుటుంబాలుకు మ్యాన్ కైండ్ పార్మ సంస్థ వారు ఆర్థిక సహాయాన్ని అందించారు. మానవతా దృక్పథంతో ఆర్ధిక చేయూత అందవ్వాలని ముఖ్య ఉద్దేశంతో మూడు లక్షల రూపాయల నగదు చెక్కును అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ సమయంలో మృతి చెందిన హోమ్ గార్డు జి మహేష్ రావు సతీమణి శైలజ కు ఆయా నగదు చెక్కును శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక జిల్లా పోలసు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కోవిడ్ మొదటి, రెండవ దశలో ప్రెంట్ లైన్ వారియర్స్ గా ముందు వరసలో ఉండి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా మృతి చెందిన పోలీసు కుటుంబాలకు అండగా నిలవాలని మ్యాన్ కైండ్ ఫార్మా సంస్థ వారు అందిస్తున్న నగదు సహాయం ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ కొనియాడారు. గతంలో కూడా కొంతమందికి ఈ సంస్థ అందించిన నగదును అందజేశామని తెలిపారు. బాధిత పోలీస్ కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎస్పీ భరోసా కల్పించారు.