జి. ఆర్ రాధిక, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు విజయ్ మణికంఠ సెబ్ అడిషనల్ ఎస్పి వారి ఆధ్వర్యంలో ఒడిషా పోలీస్ వారితో కలిసి నాటుసారా స్థావరాలపై గురువారం దాడులు జరిగాయి. ఒడిషా రాష్ట్ర సరిహద్దు గ్రామాలు అయిన దుర్గం, ఏక్మర మరియు మారంగి గ్రామాలలో అనధికారికంగా తయారు అవుతున్న నాటు సారా స్థావరాలపై సంయుక్త దాడులు చేయడం జరిగినది. దాడులలో 47 వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడమైనది. అలాగే ఆ స్థావరాలలో తయారైన 1200 లీటర్ల నాటు సారాయిని కూడా ధ్వంసం చేయడమైనది. పై దాడులలో కేపీ గోపాల్, అసిస్టెంట్ కమిషనర్, ఎస్ ఈ బి, శ్రీకాకుళం , శ్రీకాకుళం ఎస్ఈబి మరియు పోలీస్ సిబ్బంది మరియు ఒడిస్సా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.