శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నిర్వహించిన యువశక్తి సభకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు.అయితే యువశక్తి సభకు పవన్ కళ్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది కూడా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వంలో పవన్ కల్యాణ్‌ను అవమానించినందుకు శాఖ ఉండాలని హైపర్ ఆది డిమాండ్ చేశారు. ఆ శాఖ పెట్టి అదే పనిగా తిట్టండి... శాఖల పరువు తీస్తున్నారు... మీ శాఖల గురించి పది నిమిషాలు మాట్లాడితే పది సెకన్లలో దొరికిపోతారు అని విమర్శించారు. ఇంకా, దత్తపుత్రుడు అని అంటున్నారు... మీరు ఏ నోటితో అయితే దత్తపుత్రుడు అని అన్నారో అదే నోటితో అంజనీపుత్రుడు అనిపించుకుంటారు. మీ పాప్యులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా మాట్లాడితే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తొస్తాడు. నిలకడలేని రాజకీయాలు అని అంటున్నారు. మీరు ఏమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాలు చేయొచ్చా? వ్యాపారాలు ఏమీ లేని ఆయన మాత్రం సినిమాలు చేసుకుంటూ రాజకీయాలు చేయకూడదా? టేబుల్ పై భారతదేశం బొమ్మ పెట్టుకుని, టేబుల్ కింద చేయిచాచే మీది నిలకడలేని రాజకీయం అని హైపర్ ఆది అన్నారు.