శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సభలో అయన మాట్లాడ్తూ తాను గెలుస్తానో, ఉంటానో, ఓడిపోతానో తనకు తెలియదని,తనకు తెలిసిందల్లా పోరాడడం ఒక్కటేనని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. గూండా గాళ్లను తిరిగి ఎలా తన్నాలో బాగా తెలుసని, వెధవలను ఎలా ఎదుర్కోవాలో తెలుసని పేర్కొన్నారు.పార్టీ పెట్టినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు.. నా ఖాతాలో ఉన్నది కేవలం రూ. 13 లక్షలే. అయినా పట్టువదలకుండా ప్రయాణం మొదలుపెట్టాను అని తెలిపారు. గత ఎన్నికల్లో నా ఇళ్లకు జనం పోటెత్తారు.. అయితే ఓటు వేసే సమయానికి నన్ను వదిలేశారు. చట్టసభల్లో నిలబడేందుకు అవసరమైన అధికారాన్ని ఇవ్వలేకపోయారు.రెండు చోట్ల ఓడిపోయావు అని కించపరుస్తూ ఉంటే దాన్ని యుద్ధం తాలూకు గాయంగానే భావించాను. అంతేతప్ప, నేనేం బాధపడలేదు... అవమానంగా భావించలేదు.