కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 43.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో కేఎల్ రాహుల్ 64 పరుగులు, హార్దిక్ పాండ్యా 36 పరుగులతో రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa