శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన యువశక్తి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.ఈ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 'ఇది 3 ముక్కల ప్రభుత్వం. ఆయన 3 ముక్కల ముఖ్యమంత్రి. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎదుర్కొన్న వాడిని, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టండని చెప్పా. 2 ముక్కలైన రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారు' అని అన్నారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే నా జన సైనికుడి చెప్పు తీసుకుని కొడతా. మా వీర మహిళ చెప్పు తీసుకుని కొడతా. నాపై మాట్లాడే వాళ్లను నేను మర్చిపోను, నా వాళ్లు మర్చిపోరు అని అన్నారు.రాజు సరిగ్గా లేకుంటే సగం రాజ్యం నాశనం అవుతుంది.