పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ గురువారం సోదాలు చేసింది. ముర్షిదాబాద్ ఎమ్మెల్యే నుంచి రూ.10.90 కోట్లను ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇళ్లు, రైస్ మిల్లులు, బీడీ ఫ్యాక్టరీలపై అధికారులు దాడులు చేశారు. ఆ డబ్బు కూలీలకు చెల్లించేందుకు ఉంచారని టీఎంసీ నాయకులు మీడియాతో పేర్కొన్నారు.